టాలీవుడ్ లో వరస అవకాశాలు

Update: 2024-07-25 08:30 GMT

Full Viewగౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ ఇప్పుడు శ్రీలంక లో సాగుతోంది. వీడి 12 వర్కింగ్ టైటిల్ తో నిర్మిస్తున్న ఈ మూవీ స్పై థ్రిల్లర్. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే నటించనున్నట్లు తేలిపోయింది. దీనికి కారణం ఆమె సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ గా చెపుతున్నారు. భాగ్య శ్రీ బోర్సే ఆగస్ట్ 15 న విడుదల కానున్న రవి తేజ మూవీ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

                                         ఇప్పుడు విజయదేవరకొండకు జోడిగా సందడి చేయనుంది. ఇటీవల విజయదేవరకొండ కొత్త సినిమా లుక్ ఒకటి లీక్ అయింది. దీన్ని ఎవరూ షేర్ చేయవద్దని...త్వరలోనే అధికారికంగా లుక్ విడుదల చేస్తామని చిత్ర యూనిట్ కోరింది. సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల 2025 లో ఉంటుంది అని చెపుతున్నారు. 

Tags:    

Similar News