నందమూరి బాలకృష్ణ, దర్శకుడు మలినేని గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించటంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. చిత్ర యూనిట్ ఆదివారం నాడు సినిమా టైటిల్ ను దాదా గా ప్రకటించింది. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసింది.. దీని ప్రకారం బాలకృష్ణ దాదా మూవీ డిసెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో పాటు మూవీ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.