అఖండ 2 సినిమా చిత్ర యూనిట్ శుక్రవారం నాడు బిగ్ అప్డేట్ ఇచ్చింది. హీరో నందమూరి బాలకృష్ణ ఈ మూవీ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు అని అధికారికంగా వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి అని..సెప్టెంబర్ 25 న ఈ సినిమా ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడే అవకాశం లేదు అని స్పష్టం అయింది. దసరా సెలవుల టార్గెట్ గా ఒక వైపు అఖండ 2 తో పాటు పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఓజీ సినిమా కూడా ఇదే డేట్ ను లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాల ఫైట్ లేకుండా ఎవరో ఒకరు డేట్ మార్చుకుంటారు అని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఇద్దరు ఏ అప్డేట్ ఇచ్చినా కూడా రిలీజ్ డేట్ లో మాత్రం మార్పు ఉండటం లేదు. దీంతో దసరా కు బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ల ఫైట్ తప్పదు అనే వాతావరణం కనిపిస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కావటంతో ఇప్పుడు అఖండ 2 తాండవంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో వైపు కొద్ది రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా టీజర్ కూడా అఖండ 2 పై అంచనాలను మరింత పెంచింది. సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమా లు పోటీ పడితే ఎవరు హిట్ కొడతారు అన్నది కూడా ఇప్పుడు కీలకం కానుంది.