ప్రభాస్, రానా..అనుష్కల ప్రకటన!

Update: 2026-06-26 06:03 GMT

దేశ సినిమా చరిత్రలో బాహుబలి రెండు భాగాలు సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు దర్శకుడు రాజమౌళి ఈ మూవీలతో. బాహుబలి ఫస్ట్ పార్టీ ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా...బాహుబలి 2 మూవీ ఏకంగా 1800 కోట్ల రూపాయలుగా పైగా వసూళ్లను సాధించింది. ఈ రెండు పార్ట్ ల ద్వారా దర్శకుడు రాజమౌళి ఇమేజ్ కు ఒక్కసారి జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఈ మూవీ లో ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్ లు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ప్రభాస్, రానా పాత్రలకు ఎంత గుర్తింపు దక్కిందో....కట్టప్ప పాత్ర ద్వారా సత్యరాజ్ కు కూడా అంటే గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో ప్రభాస్, రానా, అనుష్క లు బాహుబలి 3 ఉంటుంది అని ప్రకటించారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. తాజాగా బాహుబలి ది టార్చిబేరర్ పేరుతో నెట్ ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ గా తీసుకొచ్చారు.

                           ఈ సందర్భంగా ప్రభాస్, రానా, అనుష్కలు మాట్లాడిన ఒక వీడియోను నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేసింది. Full Viewఅందులోనే ప్రభాస్, రానా, అనుష్క లు బాహుబలి 3 ఉంటుంది అని ప్రకటించారు. రాజమౌళి. శోభు ఇక్కడ లేరు కాబట్టి ఏది పడితే అది...ఇది చెప్పేస్తున్నా. ప్రపంచం ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు, కానీ బాహుబలి 3 కచ్చితంగా వస్తుంది అని రానా ప్రకటిస్తే...ప్రభాస్ రెండు చేతులతో బాహుబలి 3 సంకేతాలు ఇచ్చారు. దీంతో దర్శకుడు రాజమౌళి వారణాసి మూవీ తర్వాత బాహుబలి 3 పై దృష్టి పెట్టె అవకాశం ఉంది అనే చర్చ మొదలైంది. గతంలో ఒక సారి దర్శకుడు రాజమౌళి కూడా బాహుబలి 3 సినిమా తీయటానికి అవకాశం ఉంది ప్రకటించారు. దీంతో పక్కాగా ఈ సినిమా పట్టాలు ఎక్కటం ఖాయం అనే అంచనాలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News