దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరణ్య సినిమా విడుదల తేదీ ఖరారు అయింది. ప్రభు సోలోమీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 26న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రానా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 'కొత్త సంవత్సరానికి సాధారణ పరిస్థితులతో ఆహ్వానం చెబుతున్నాము. 'హాథీ మేరీ సాథీ, అరణ్య, కాదన్ సినిమా 26న మీ దగ్గరలోని థియేటర్లలో విడుదల కానుంది'. అని రానా ట్వీట్ చేశారు.
అదే రోజున వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్ నటించిన రంగ్ దే చిత్రం కూడా విడుదల కాబోతుంది. దీంతో మార్చి 26 రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానాతోపాటు జోయా హుస్సేన్, కల్కి కణ్మిణీ, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్, శ్రియా పిలగోన్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.