అనుపమ పరమేశ్వరన్. ఈ మధ్య సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిపోయారు. నిత్యం కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఆలరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో అభిమానులకు చేరువ అయ్యేందుకు ఇంతకు మించిన మార్గం లేకుండా పోయింది అందరికి. అంతా సాఫీగా ఉండి ఉంటే ఏదో ఒక సినిమా అప్ డేట్స్ తో ముందుకొచ్చేవారు.
ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నా మధ్యమధ్యలో మళ్ళీ కొత్త కొత్త కరోనా స్టెయిన్ లు అంటూ ఆందోళన కలిగించే వార్తలు వస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంకా స్టే హోమ్..స్టే సేఫ్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే స్టిల్స్ పెట్టింది. అందులో ఒకటే ఇది.