'అనుభ‌వించురాజా' టీజ‌ర్ వ‌చ్చేసింది

Update: 2021-09-23 05:04 GMT

Full Viewబంగారం గాడు ఊర్లోనూ..వాడి పుంజు బ‌రిలో ఉండ‌గా ఇంకొడు గెల‌వ‌టం క‌ష్టం ఏహె అంటూ రాజ్ త‌రుణ్ డైలాగు తో 'అనుభ‌వించురాజా' సినిమాకు సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల అయింది. గోదావ‌రి జిల్లాల్లోని కోడిపందెల నేప‌థ్యంలో ఈ సినిమా సాగిన‌ట్లు టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. తాను పెంచుకుంటున్న కోడిపుంజుతో రాజ్ త‌రుణ్ చెప్పే డైలాగ్ న‌వ్వులు తెప్పిస్తుంది. నీ బాధ నాకు అర్ధం అయింది.

నువు గెలిచి నా ప‌రువు కాపాడితే..సాయంత్రం నీ గంప కింద నాలుగు పెట్ట‌లు పెడ‌తా..ప్లీజే అంటూ ఆఫ‌ర్ ఇస్తాడు. ఈ సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ కు జోడీగా ఖాషిష్ ఖాన్ న‌టిస్తోంది.. అన్న‌పూర్ణా స్టూడియోస్, వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పి సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకు శ్రీను గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Tags:    

Similar News