పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా అంటే విడుదల వాయిదా పక్కా అన్నట్లు తయారు అయింది పరిస్థితి. అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత కూడా ఈ ఏడాది డిసెంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఫౌజీ మరో సారి వాయిదా పడింది. ఇప్పుడు అదే జాబితాలోకి మరో ప్రభాస్ సినిమా వచ్చి చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ముందు చెప్పిన తేదికి ప్రభాస్ స్పిరిట్ మూవీ విడుదల కావటం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ విడుదల తొలుత 2027 మార్చిలో ఉంటుంది అని ప్రకటించారు. కానీ చిత్ర యూనిట్ ఆదివారం నాడు కొత్త విడుదల తేదీని ప్రకటించింది. దీని ప్రకారం స్పిరిట్ విడుదల 2027 అక్టోబర్ 29 కి మారింది. అంటే వచ్చే దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ తో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే స్పిరిట్ విడుదలకు ఇంకా నికరంగా ఏడాది సమయం ఉంది అన్న మాట. స్పిరిట్ మూవీ లో ప్రభాస్ కు జోడిగా త్రిప్తి డిమ్రి నటిస్తోంది.

                                         Full Viewతొలుత ఈ రోల్ కోసం బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ దీపికా పాడుకొనే ను ఓకే చేశారు. తర్వాత ఆమె పని గంటలతో పాటు పలు విషయాల్లో డిమాండ్స్ పెట్టారు అనే కారణంతో తప్పించారు. ఆమె ప్లేస్ లో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో సినిమా ఫౌజీ కూడా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు తొలుత. ఈ మేరకు రిలీజ్ డేట్ తో పోస్టర్ కూడా వచ్చేసింది. కానీ ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ కూడా మరో సారి వాయిదా పడింది. అధికారికంగా చెప్పకపోయినా కూడా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల కూడా వచ్చే ఏడాదే ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Tags: