Full View'పక్కా కమర్షియల్ ' సినిమా నుంచి అందాల రాశి లిరికల్ సాంగ్ వచ్చేసింది. ఈ సినిమాలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. జులై 1న సినిమా విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచింది. . అందులో భాగంగానే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆకట్టుకునేలా ఉండటంతో అటు గోపీచంద్, రాశీ ఖన్నా వెరైటీ స్టెప్స్ వేశారు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.