ఈ సంక్రాంతి సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా అంటే నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగ ఒక రాజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి నవీన్ పోలిశెట్టి చేస్తున్న ప్రమోషన్స్ ఈ సినిమా పై బజ్ పెరగటానికి దోహద పడ్డాయి. మరో వైపు ఈ సినిమా ఫన్ గ్యారంటీ అన్న ఫీలింగ్ ఇప్పటికే ప్రేక్షకులకు వచ్చింది. గురువారం నాడు విడుదల అయిన ఈ మూవీ ట్రైలర్ అసలైన సంక్రాంతి సందడి అంతా ఇందులో ఉంది అనే ఫీలింగ్ ఇచ్చింది.