ఇటీవలే బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడంతో అమిగోస్ పై కూడా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా మైనస్ అయింది అనే అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో ఉంది. అమిగోస్ కు మొత్తం బిజినెస్ 12 కోట్ల రూపాయలు జరిగింది అని...వీకెండ్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించటం పెద్ద కష్టం కాదనే చెపుతున్నారు. సహజంగా శని, ఆదివారాలు కలెక్షన్స్ ఆశాజనకంగా ఉంటాయనే విషయం తెలిసిందే.