'ప్రేమ కాదంట'. అల్లు శిరీష్ కొత్త సినిమా పేరు ఇది. ఆదివారం నాడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు "Prema కాదంట" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అద్దం ముందు ఫొటోలు దిగుతున్న అను ఇమ్మాన్యుయేల్ మీద హీరో ముద్దుల వర్షం కురిపిస్తున్న లుక్ విడుదల చేశారు. రాకేష్ శశి దర్శకత్వం లో ఈ మూవీ తెరకెక్కుతోంది.