Full Viewకొన్ని కొన్ని కాంబినేషన్లు అలా సెట్ అవుతాయి. సినిమాలు కూడా అంతే హిట్ అవుతాయి. అలాంటి వాటిలో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి అని చెప్పుకోవచ్చు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు నాల్గవ సినిమా రాబోతోంది. చిత్ర యూనిట్ అధికారికంగా సోమవారంనాడు ఈ విషయాన్నీ ప్రకటించింది. దీంతో అల్లు అర్జున్ ఫాన్స్ ఫుల్ ఖుషి. ఏ మాత్రం గ్యాప్ లేకుండా అల్లు అర్జున్ కూడా వరసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాడు. అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, అల వైకుంఠపురములో’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న నాలుగో చిత్రమిది.
‘అల వైకుంఠపురములో’ చిత్రం విడుదలైన కొన్నాళ్ల నుంచే బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రానుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తను నిజం చేస్తూ ఇటీవల నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటన చేశాయి. అల్లు అర్జున్‌తో విజువల్ వండర్‌ను క్రియేట్ చేయడానికి నాలుగో సారి కలవడానికి అంతా సిద్ధం. హారికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలో ఈసారి మరింత పెద్దగా.. ఇతర వివరాలు త్వరలో’’ అంటూ సినిమా ప్రకటన విడుదల వీడియోలో వెల్లడించారు.