టి సిరీస్ తో జట్టు కట్టిన అల్లు అర్జున్

Update: 2023-03-03 05:40 GMT

మూడు పవర్ హౌస్ లు కలిశాయి. మరి ఇంక ఆ సినిమా పవర్ ఎంత ఉండాలి?. అల్లు అర్జున్ హీరోగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ కు చెందిన ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ కొత్త సినిమా నిర్మించనున్నారు. .శుక్రవారం నాడు చిత్ర యూనిట్ అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు మాత్రమే నిర్మించే టి సిరీస్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పాన్ ఇండియా నిర్మించనుండటం విశేషం. ఈ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు..ఇతర నటీ, నటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా తో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ అది పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది అని సమాచారం.

                              పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో మంచి డిమాండ్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత అయన ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టారు ఇప్పుడు టి సిరీస్ తో కలిసి అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ ...అల్లు అర్జున్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ కాంబినేషన్ చూసి వచ్చే కొత్త సినిమా ఇంక ఎంత మాస్ గా ఉంటదో అన్న ఖుషీగా అల్లు అర్జున్ ఫాన్స్ ఉన్నారు. 

Tags:    

Similar News