Full Viewమనసు కోరితే 'తగ్గేదేలే' అంటున్నాడు అల్లు అర్జున్. ఇటీవల కాలంలో ఆయన యాడ్స్ లోనూ దూకుడు పెంచాడు. తాజా సూపర్ హిట్ అయిన సినిమా పుష్పలోని డైలాగ్ నే జొమాటో యాడ్ కు వాడేశారు. ఇందులో అల్లు అర్జున్ తోపాటు నటుడు సుబ్బరాజు కూడా కన్పిస్తాడు. ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్ చేతికి కొత్తగా జొమాటో వచ్చి చేరింది. తాజాగా ఈ యాడ్ కు సంబంధించి వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ యాడ్ లో ఓ ఫైట్ సీన్ ఉంటుంది. బన్నీ సుబ్బరాజ్‌ను ఒక్క కిక్కుతో గాల్లోకి లేపుతాడు. ఆ షాట్ స్లో మోషన్‌లో ఉండగా సుబ్బరాజ్..'బన్నీ నన్ను కొంచెం తొందరగా కింద పడేయవా అని అడిగితే..అల్లు అర్జున్ సౌత్ సినిమా కదా..కొంచెం ఎక్కువ సేపు ఎగరాలి అంటాడు.
మధ్యలో సుబ్బారాజు గోంగూర మటన్ తినాలని ఉంది. కింద పడేలోగా రెస్టారెంట్లు క్లోజ్ అవుతాయి' అని అడిగితే ..' గొంగూరు మటన్ ఏంది. ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా' అంటూ బన్నీ చెప్తాడు. 'ఏం కావాలన్నా.. ఎప్పుడు కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా.. మనసు కోరితే తగ్గేదేలే' అంటూ పుష్ప స్టైల్లో బన్నీ చెప్పే డైలాగ్‌తో యాడ్ ముగుస్తోంది. ఓ వైపు సినిమాల ద్వారా భారీ ఎత్తున ఆర్జిస్తున్న హీరోలు..హీరోయిన్లు ఇప్పుడు ప్రముఖ బ్రాండ్ల ప్రమోషన్ ద్వారానూ భారీగా అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు.