ఎందుకో తెలుసా?

Update: 2024-03-26 07:41 GMT

Full Viewపుష్ప. ఈ సినిమానే అల్లు అర్జున్ ను ఒకే సారి పాన్ ఇండియా హీరో గా మార్చేసింది. అందుకే పుష్ప 2 సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అగస్ట్ 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీని కంటే ముందే అల్లు అర్జున్ ఫాన్స్ కు ఇది ఎంతో శుభవార్త అనే చెప్పాలి. దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అయన మైనపు విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఇది మార్చి 28 న జరగనుంది. దీనికోసం అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే దుబాయ్ కి చేరుకున్నారు. లండన్ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు విగ్రహాలు ఉన్న విషయం తెలిసిందే.

                                         అల్లు అర్జున్‌ విగ్రహం దుబాయ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్ల్లు అర్జున్‌ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం. దీంతో దక్షిణాది తొలి హీరోగా బన్నీ రికార్డ్‌ సెట్‌ చేశారు. అంతే కాకుండా దుబాయ్‌ గోల్డెన్‌ వీసా అందుకున్న తొలి తెలుగుస్టార్‌ కూడా ఆయనే కావడం విశేషం. గతే ఏడాదే అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు ఈ అవార్డు అందుకున్న మొదటి హీరో కూడా అల్లు అర్జున్ కావటం విశేషం. 

Tags:    

Similar News