పుష్ప 2 హంగామా మొదలైంది

Update: 2023-04-07 16:26 GMT

Full Viewఅల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. దీంతో దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ (పార్ట్ 2 ) కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు పురస్కరించుకొని చిత్ర యూనిట్ పుష్ప 2 సినిమాకు సంబంధించి వేర్ ఈజ్ పుష్ప పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు కావటం తో చిత్ర యూనిట్ సందడి మొదలు పెట్టింది. ఈ వీడియో అప్పుడే రికార్డులు నమోదు చేస్తోంది.

  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న సందడి చేసిన విషయం తెలిసిందే. ఎనిమిది బులెట్ గాయాలతో పుష్ప పోలీస్ కాల్పుల్లో చనిపోయాడా? లేదా అనే అంశంపై ఇది నడిచింది. చివరిలో పులికి అల్లు అర్జున్ ఎదురువెళ్ళటం , పులి వైపు ఈ స్టైలిష్ స్టార్ వెరైటీగా చూడటం ఇందులో హై లైట్ గా ఉంది అని చెప్పాలి. 

Tags:    

Similar News