ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ లో సుదీర్ఘమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ తాజా మహాబలేశ్వరం లో షూటింగ్ ప్రారంభించింది. కరోనా కారణంగా విపరీతమైన జాప్యంతో షెడ్యూల్స్ సాగుతున్నాయి. అయితే ఈ టైమ్ ను కవర్ చేసేందుకు చిత్ర యూనిట్ శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటూ సాగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లోకి అలియా భట్ ఎంట్రీ ఇస్తోంది.
ఈ భాలీవుడ్ భామ రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి అలియా పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కన్పించనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియో మోరిస్ ను ఎంపిక చేశారు.