నాగచైతన్య. సమంత విడాకులపై అక్కినేని తాను చేసినట్లు ప్రచారం జరిగిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున స్పందించారు. అవి పూర్తిగా నిరాధారమైన వ్యాఖ్యలు అన్నారు. విడాకుల అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని..తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. పుకార్లను వార్తలుగా మలచవద్దని కోరారు. అంతకు ముందు సమంతే ముందు విడాకులు కోరితే నాగచైతన్య అందుకు అంగీకరించాని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఇవి వైరల్ గా మారాయి.