బాలకృష్ణ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. దసరా రోజు చిత్ర యూనిట్ అఖండ 2 విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసింది. వాస్తవానికి అఖండ 2 సినిమా కూడా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ తో కలిసి సెప్టెంబర్ 25 విడుదల అవుతుంది అని తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత వివిధ కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ న్యూ లుక్ ను విడుదల చేశారు.
బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అఖండ కూడా ఇదే జాబితాలో ఉంది. దీంతో అఖండ 2 తాండవం సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ మూవీ ని రామ్ ఆచంట, గోపి ఆచంట లు నిర్మిస్తున్నారు. అఖండ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ ఎంతో కీలకంగా మారింది అన్న విషయం తెలిసిందే. అఖండ 2 మూవీ కి కూడా థమన్ మ్యూజిక్ అందించారు. దీంతో అఖండ 2 మూవీ పై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ కు పెరిగాయి అనే చెప్పాలి. అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్ , ప్రగ్యా జైస్వాల్ లు నటిస్తున్నారు.