అఖండ 2 ..ఇక తాండవమే

Update: 2024-10-16 06:29 GMT

Full Viewనందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత మంచి విజయాన్ని దక్కించుకుందో తెలిసిందే. ఇప్పడు ఇదే కాంబినేషన్ లో అఖండ 2 తాండవం సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం నాడు హైదరాబాద్ లో జరిగాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అఖండ 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే చెప్పొచ్చు. అఖండ 2 లో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

                                            ఆమె కూడా సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అఖండ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ కావటంతో ఇప్పుడు అందరి దృష్టి అఖండ 2 పై పడింది అనే చెప్పాలి. భారీ బడ్జెట్ తో అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ సంస్థ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాని బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజశ్వని ప్రెజంట్ చేస్తున్నారు. పూజా కార్యక్రమం సందర్బంగా చిత్ర యూనిట్ అఖండ 2 టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Tags:    

Similar News