నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం సందడి మొదలైంది. ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ బ్లాస్టింగ్ రోర్ పేరుతో ఒక వీడియో విడుదల చేసి ప్రొమోషన్స్ మొదలు పెట్టింది అనే చెప్పాలి. దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ సినిమా అంటేనే అంచనాలు సహజంగా ఒక రేంజ్ లో ఉంటాయి. వీళ్లిద్దరి గత ట్రాక్ రికార్డు ప్రకారం అఖండ 2 పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి. శుక్రవారం నాడు విడుదల చేసిన ఈ బ్లాసింగ్ రోర్ లో బాలకృష్ణ డైలాగులు కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి.