ఆచార్య సినిమాకు సంబంధించి రామ్ చరణ్, పూజా హెగ్డేలు కలసి ఉన్న తొలి లుక్ ను చిత్ర యూనిట్ ఉగాది సందర్భంగా విడుదల చేసింది. అంతే కాదు 'ఆయుధమైనా..అమ్మాయి అయినా సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది' అంటూ కామెంట్ జోడించింది ఆ ఫోటోకు.
ఉగాది శుభాకాంక్షలతో ఈ కొత్త లుక్ ను విడుదల చేశారు. ఆచార్య సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తుండగా..ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.