Full Viewశర్వానంద్, రష్మిక మందన జంటగా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహర్లు'. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. తన పెళ్ళి కష్టాల గురించి చెబుతూ శర్వానంద్ పాడే ఈ పాట ఆకట్టుకుంటోంది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇందులో కుష్భూతోపాటు రాధిక, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు.