వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం మూవీ కొత్త విడుదల వచ్చేసింది. గత కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉన్న తేదీనే చిత్ర యూనిట్ అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా అక్టోబర్ 30 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి, మరో కీలక పాత్రలో నివేద పేతురేజ్ నటించింది. ఫస్ట్ ఈ సినిమాను అక్టోబర్ 2 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత విడుదల తేదీని అక్టోబర్ 9 కి మార్చారు. ఫైనల్ గా ఇప్పుడు అక్టోబర్ 30 ను ఫిక్స్ చేశారు.

                                  Full Viewరెండు దశాబ్దాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సినిమా చేశానని..వినోదం, యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెపుతూ హీరో వెంకటేష్ ఎక్స్ వేదికగా కొత్త విడుదల తేదీని వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో న్యూ లుక్ ను షేర్ చేశారు. ఇప్పటికే విడుదల అయిన కంటెంట్ మూవీ పై ఆసక్తిని పెంచాయి. కాకపోతే వరసగా పలు మార్లు విడుదల తేదీ మార్పు ప్రభావం సినిమాపై ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా.. హారికా అండ్ హాసిని బ్యానర్ పై ఆదర్శ కుటుంబం మూవీ ని నిర్మించారు.

Tags: