పొలిటికల్ ..పవర్ ఫుల్ డైలాగులు

Update: 2024-03-19 11:53 GMT

Full Viewపవర్ ఫుల్ డైలాగులు. పొలిటికల్ డైలాగులు. వచ్చే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో ఒకటి విడుదల అయింది. మంగళవారం సాయంత్రం విడుదల అయిన ఈ వీడియో కు భగత్స్ బ్లేజ్ అనే పేరు పెట్టారు. ఇందులో పవన్ ఎంట్రీ ముందు విలన్ టీ గ్లాస్ చూపిస్తూ నీ రేంజ్ ఇది అంటూ దాన్ని కింద పడేస్తాడు. పగిలిన గ్లాస్ ముక్కను చేతిలోకి తీసుకుని....గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైజు కాదు...సైన్యం. కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు..యాక్షన్ సీన్స్ తో ఈ వీడియో ఆకట్టుకుంటుంది. జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్ అనే విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడి గా శ్రీలీల నటిస్తోంది.

Tags:    

Similar News