
చిరంజీవి, రామ్ చరణ్ లు కలసి నటించిన 'ఆచార్య' మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా పిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డెలు సందడి చేశారు. ఇటీవల విడుదల అయిన చిరంజీవి, రెజీనాల ప్రత్యేక గీతం విశేషంగా ఆకట్టుకుంది. ఆచార్య కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.