వైట్ హౌస్ కు చేరుకున్న డొనాల్డ్ ట్రంప్

Update: 2020-10-06 04:41 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి వైట్ హౌస్ కు చేరుకున్నారు. మరికొన్ని రోజులు వైట్ హౌస్ లో ఉంటూ చికిత్స పొందనున్నారు. అంతే కాదు కరోనా చికిత్స పొందుతూ కూడా ఆయన మాస్క్ తీసి ఫోటోలకు ఫోజులు ఇఛ్చారు. గత నాలుగు రోజులుగా ట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. చికిత్స తీసుకుంటూ కారులో బయటకు వచ్చి అభిమానులకు అబివాదం చేస్తూ కూడా ట్రంప్ విమర్శల పాలు అయ్యారు. ఆయినా సరే ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి మాస్క్ తీసి ఫోటోలకు ఫోజు ఇవ్వటంపై ఆరోగ్య నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ 19కి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

తాను ప్రస్తుతం ఎంతో సౌకర్యం వంతంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ అనంతరం ట్రంప్‌తో పోలిస్తే ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ పాపులారిటీ బాగానే పెరిగిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ చెబుతోంది. అధ్యక్ష రేసులో దిగిన అనంతరం తొలిసారి ఆధిక్యం దిశగా సాగిన బైడెన్‌, ట్రంప్‌ కంటే 14 పర్సంటేజ్ పాయింట్లు సాధించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రెసిడెంట్‌ పదవి దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న ట్రంప్‌.. నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా, అనారోగ్యాన్ని పక్కనబెట్టి మరీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు.

Similar News