బీహార్ కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. పాశ్వాన్ 1946 జులై 5న జన్మించారు.
పాశ్వాన్ మృతి చెందిన విషయాన్ని ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రామ్ విలాస్ పాశ్వాన్ ఎనిమిదిసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ జనశక్తి పార్టీకి పాశ్వాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. పాశ్వాన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. దేశంలోని అత్యంత ముఖ్యమైన దళిత నేతల్లో పాశ్వాన్ ఒకరు.