రాహుల్ గాంధీని తోసేశారు

Update: 2020-10-01 10:49 GMT

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల హాథ్రాస్ పర్యటన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. గ్యాంగ్ రేప్ నకు గురై మరణించిన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వీరిద్దరూ ఈ పర్యటన తలపెట్టారు. అయితే యమునా ఎక్స్ ప్రెస్ పైనే వీరిన అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 114 సెక్షన్ అమల్లో ఉన్నందున తాము ఎలాంటి సమావేశాలు నిర్వహించటం లేదని..తాను ఒక్కడినే రోడ్డుపై నడుచుకుంటానని వెళతానని తెలిపారు. ఎలా అరెస్ట్ చేస్తారు..ఎందుకు చేస్తారు..ఏ నిబంధన ప్రకారం చేస్తారు అంటూ రాహుల్ గాంధీ పోలీసుతో వాదనకు దిగారు.

అయితే కోవిడ్ నిబంధనలు ఉన్నందున తాము అనుమతించబోమని తేల్చిచెప్పారు.. ఈ సందర్బంగా జరిగిన తోపులాటలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కింద పడిపోయారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ రోడ్డుపై నడిచే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. పోలీసులే తనను తోసేసి లాఠీఛార్జి చేశారని విమర్శించారు. మోడీ ఒక్కరే నడవాలా అంటూ విమర్శలు గుప్పించారు. యూపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రియాంక గాంధీ విమర్శించారు.

Similar News