మోడీకి విలాస విమానం..జవాన్లకు డొక్కు ట్రక్కులా?

Update: 2020-10-10 14:31 GMT
మోడీకి విలాస విమానం..జవాన్లకు డొక్కు ట్రక్కులా?
  • whatsapp icon

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోడీతోపాటు వీవీఐపిల కోసం 8400 కోట్ల రూపాయల వ్యయంతో విలాసవంతమైన విమానాలు మాత్రం కొనుగోలు చేశారు. దేశ రక్షణ కోసం పనిచేసే జవాన్లకు మాత్రం కనీసం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు లేకుండా డొక్కు ట్రక్కుల్లో పంపుతారా? అని ప్రశ్నించారు. తమను బుల్లెట్ ప్రూఫ్ కాని వాహనంలో తీసుకెళ్ళటంపై జవాన్లు మాట్లాడుకుంటున్న వీడియోను కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్ కు జత చేశారు.

ఈ వీడియోలో జవాన్లు తమ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారని చర్చించుకుంటారు. ఆర్మీలో సీనియర్లు మాత్రం బుల్లెట్ ఫ్రూప్ వాహనాలు ఉపయోగిస్తూ తమను మాత్రం ట్రక్కుల్లో పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విలాస విమానాల కొనుగోలుకు వెచ్చించిన సొమ్ముతో సియాచిన్-లద్దాఖ్ ల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు ఎన్నో సౌకర్యాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.

 

Similar News