హాథ్రాస్ బాధితురాలి కోసం ప్రియాంక ప్రార్ధనలు

Update: 2020-10-02 13:40 GMT

దేశ రాజకీయం హాథ్రాస్ చుట్టూనే తిరుగుతోంది. గురువారం నాడు హాథ్రాస్ పర్యటనకు బయలుదేరిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఘర్షణలో రాహుల్ గాంధీ కిందకూడా పడిపోయారు. శుక్రవారం నాడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే ఈ సారీ ఎంపీ మారారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో జరిగిన ఘర్షణలో ఆయన కూడా కిందపడిపోయారు. దీంతో విపక్షాలు అన్నీ కేంద్రంలోని మోడీ సర్కారుతోపాటు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై మండిపడుతున్నాయి. ఢిల్లీలోని వాల్మీకి ఆలయంలో నిర్వహించిన ప్రార్థన సమావేశానికి కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరయ్యారు.

బాధితురాలి ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. హాథ్రాస్ ఘటన పట్ల కేంద్రం, యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. గురువారం ప్రియాంక, రాహుల్‌ గాంధీలు బాధితురాలి కుటుంబాన్ని పరమార్శించాలని భావించి గ్రామానికి వెళ్లాడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బిజెపికి సమస్యాత్మకంగా మారింది. హాథ్రాస్ ఘటనలో వరసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర విమర్శలు పాలు అవుతున్నాయి.

Similar News