దుబ్బాక ఉప ఎన్నిక వ్యవహారం తెలంగాణలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. రెండు రోజుల క్రితం షామీర్ పేట దగ్గర పోలీసులు ఓ వాహనంలో నలభై లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇది బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు కు చెందినదిగా పోలీసులు వెల్లడించారు. నగదుతో పట్టుబడిన వారితో రఘునందన్ రావు పీఏ మాట్లాడినట్లు తమకు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఇఫ్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు తన ఫోన్ తోపాటు తన సిబ్బంది ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాపింగ్ చేస్తుందంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ కు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసు విభాగం ఈ పనిచేస్తుందని, వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అక్టోబర్ 5 న జరిగిణ సంఘటన ద్వారా ఇది రుజువయ్యిందని , వెంటనే ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రఘునందన్ రావు కోరారు.