అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ ఎన్నికల కసరత్తు వేగంగా సాగుతోంది. ఈ సారి ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మెజారిటీ పార్టీలో బ్యాలెట్ విధానానికే మొగ్గుచూపటంతో ఎన్నికల సంఘం కూడా ఈ మార్గాన్నే ఎంచుకుంది. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్దతకు తెరపడినట్లు అయింది. కోవిడ్-19 నేపథ్యంలోబ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
దీంతోపాటు మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 7 వేల పోలింగ్ బూత్‌లున్నాయి. గతంలో ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 1400 మంది ఓటర్లు ఉండగా.. కొవిడ్ నేపథ్యంలో 750 నుంచి 800 మంది ఓటర్లకు ఒక బూత్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.