ఉత్తరప్రదేశ్ లో రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. హాథ్రాస్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను యూపీ పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. యమునా ఎక్స్ ప్రెస్ పైనే నేతలు ఇద్దరినీ పోలీసులు నిలువరించారు. హాథ్రాస్ రేప్ ఘటన పై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కేవలం రెండు వారాల్లో ఎనిమిది రేపులు జరిగాయంటే పరిస్థితి ఎలా ఊహించుకోవచ్చు.
కాంగ్రెస్ తోపాటు బహుజనసమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ లు కూడా యోగి అధిత్యనాథ్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హాథ్రాస్ ఘటనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా బాధితురాలి అంత్యక్రియల వ్యవహారం కూడా తీవ్ర వివాదస్పదం అయిన విషయం తెలిసిందే. అందుకే కాంగ్రెస్ రంగంలోకి దిగింది. హాథ్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.