మాజీ మంత్రి, సీనియర్ నేత గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనటం లేదు. గల్లా అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే రాష్ట్ర కమిటీని, కొత్త పొలిట్ బ్యూరోను ప్రకటించనున్న విషయం తెలిసిందే.