అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. కరోనా సోకిన సమయంలో ఆక్సిజన్ తగ్గుముఖం పట్టినా చికిత్స ప్రారంభించిన తర్వాత ఆక్సిజన్ లెవల్స్ సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అయితే మరికొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సి రావొచ్చని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచే డొనాల్డ్ ట్రంప్ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కు రెండుసార్లు రెమిడివిసిర్ డోసులు ఇవ్వగా మంచి ఫలితాన్ని ఇచ్చాయని..మరోసారి కూడా ఈ డోస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
చికిత్సకు ట్రంప్ స్పందిస్తున్నారని అధ్యక్షుడి ఫిజిషియన్ షాన్ కాన్లీ వెల్లడించారు. ట్రంప్‌నకు తొలుత రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా చికిత్స తర్వాత పెరిగాయని ప్రస్తుతం ఆక్సిజన్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని కాన్లీ పేర్కొన్నారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, రాబోయే 48 గంటలు కీలకమని పేర్కొంటూ ట్రంప్ ఓ వీడియో విడుదల చేశారు. అమెరికా మీడియాలోనూ ట్రంప్ ఆరోగ్యంపై పలు కథనాలు వెలువడుతున్నాయి