తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దేశ రాజధాని ఢిల్లీలో 1100 గజాల మీటర్ల స్థలం కేటాయించారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణవ్యవహారాల శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ దీన్ దయాలు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ కు లేఖ ద్వారా సమాచారం అందజేశారు.
శుక్రవారం నాడే ఈ లేఖ అందింది. ఢిల్లీలో స్థలం కేటాయింపు పూర్తయినందున త్వరలోనే పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి..త్వరలోనే భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని సీఎం కెసీఆర్ తెలిపారు.ఈ భూ కేటాయింపు పలు నియమ, నిబంధనలకు లోబడి ఉంటుంది.