డీ కె శివకుమార్ నివాసంపై సీబీఐ దాడులు

Update: 2020-10-05 05:29 GMT

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీ కె శివకుమార్ కు షాక్. సోమవారం నాడు ఆయన నివాసంతోపాటు కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఓ అవినీతి కేసు విచారణలొ భాగంగా ఈ దాడులు చేసినట్లు చెబుతున్నారు. బెంగుళూరులోని శివకుమార్ నివాసంతోపాటు ముంబయ్ తదితర ప్రాంతాల్లో ఆయన కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. డీ కె శివకుమార్ సోదరుడు సురేష్ కూడా సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసి దాడులకు దిగింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సీబీఐ, ఈడీలాంటి పెంపుడు సంస్థలను అడ్డం పెట్టుకుని ఇలాంటి దాడుల చేస్తున్నారని..వీటికి తాము భయపడబోమని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.

 

Similar News