ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కరోనా బారినపడ్డారు. ఆయన మంగళవారం నాడు రొటీన్ గా కోవిడ్ 19 పరీక్ష చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఎలాంటి లక్షణాలు లేవు. ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. అయినా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు వెంకయ్యనాయుడికి సూచించారు. వెంకయ్యనాయుడు భార్య ఉషా నాయుడికి కరోనా నెగిటివ్ అని తేలింది. ఆమె సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.