సెప్టెంబర్ 2. పవన్ కళ్యాణ్ డే. ఎందుకంటే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒకే రోజు మూడు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ వచ్చాయి. ఇది ఆయన అభిమానులకు పుల్ కుషీని ఇచ్చిందనే చెప్పాలి. ‘గబ్బర్‌సింగ్' విజయం తర్వాత పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. స్టైలిష్ బైక్, సీటుపై పెద్ద బాలశిక్ష పుస్తకం, ఓ గులాబీ పువ్వుతో పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫొటోలూ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి. 'ఈసారి కేవలం ఎంటర్‌టైన్‌మెంటే కాదు..' అంటూ.. హరీష్ హింట్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో పాటు సంగీతానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.