ఖాజిపల్లి అర్బన్ పార్కు దత్తత తీసుకున్న ప్రభాస్

Update: 2020-09-07 11:46 GMT

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో ప్రభాస్ ఖాజిపల్లి అర్బర్ ఫారెస్ట్ పార్క్ దత్తతకు ముందుకొచ్చారు ఆయన సోమవారం నాడు తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ జె. సంతోష్ కుమార్ తో కలసి పార్కులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభాస్ 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తతకు ముందుకు వచ్చారని తెలిపారు.

ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు తన తండ్రి దివంగత యూ వీ ఎస్ రాజు పేరు మీద రెండు కోట్ల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. అవసరం అయితే మరింత ఆర్ధిక సాయం చేయటానికి కూడా సిద్ధం అని తెలిపారు. ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంఖుస్థాపన, మొక్కలు నాటిన సంతోష్, ప్రభాస్. వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలు పరిశీలించారు.

 

Similar News