బిజెపి జాతీయ కార్యవర్గంలో డీ కె అరుణ, దగ్గుబాటి పురంధేశ్వరి

Update: 2020-09-26 11:21 GMT

బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీ కె అరుణకు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కింది. తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ను ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. మొత్తం 70 మంది సభ్యులతో జెపి నడ్డా కొత్త టీమ్ ను ప్రకటించారు. ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరికి చోటు దక్కింది.

ఏపీ నుంచే జాతీయ కార్యదర్శి గా సత్యకుమార్ నియమితులయ్యారు. బిజెపిలో కీలక నేతలుగా ఉన్న రామ్ మాధవ్, మురళీధర్ రావు లకు ఈ సారి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు దక్కలేదు. జీవిఎల్ నర్సింహారావు కు దక్కని జాతీయ అధికార ప్రతినిధి హోదా. వీరికి ఇతర పదవులు ఇస్తారా లేదా అన్నది కొద్ది రోజులు పోయిన తర్వాత కానీ తెలియదు.

Similar News