నిలకడగా బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

Update: 2020-08-15 12:09 GMT

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు ఆడియో సందేశం ద్వారా తెలిపారు. శుక్రవారం రాత్రి ఆకస్మాత్తుగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం క్షీణించటంతో ఆయన్ను ఐసీయూకి తరలించి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో వైద్య సేవలు అందించారు. అయితే శుక్రవారం రాత్రి నుంచే పరిస్థితి కొంత మెరుగుపడింది. వెంటిలేటర్ పై ఉంచటం ఉపయోగపడిందని ఎస్సీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్సీ చరణ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

తనకు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని..అందుకే అభిమానులు..అందరికీ క్లారిటీ ఇఛ్చేందుకే వీడియో ద్వారా ఆరోగ్య వివరాలు అందజేస్తున్నానని తెలిపారు. బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఐసీయూలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీదే చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నామని వైద్యులు తెలిపారు. ఆగస్టు 5న కరోనాతో ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

 

 

Similar News