దేశంలోని అగ్రశ్రేణి కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వేతనాల కోత ప్రకటించింది. సంస్థ అధినేత ముఖేష్ అంబానీ తనకు వచ్చే 15 కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో పదిహేను లక్షల రూపాయల లోపు వార్షిక వేతనాలు ఉన్న వారికి ఎలాంటి కోతలు ఉండవు. ఆపైన వేతనాలు ఉన్న వారికి మాత్రం కోతలు తప్పవు. ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50 శాతం వరకు కోత విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10 శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ లీడర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం కోత విధించింది. కరోనా దెబ్బతో రిలయన్స్ కూడా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.