స్టాక్ మార్కెట్..సేమ్ సీన్

Update: 2020-03-16 11:59 GMT

భారతీయ స్టాక్ మార్కెట్లో కల్లోలం ఆగటం లేదు. సోమవారం నాడు మరోసారి సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేసుకుంది. మార్కెట్ క్లోజింగ్ లో సెన్సెక్స్ ఏకంగా 2700 పాయింట్ల నష్టంతో ముగిసింది. ప్రారంభం నుంచి కూడా మార్కెట్లు నస్టాలతోనే సాగాయి. నిఫ్టీ కూడా 757 పాయింట్లు కోల్పోయింది. ఓ వైపు కరోనా భయాలు పెరుగుతుండటంతో, ఆర్ధిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా మార్కెట్ ను మరింత దెబ్బతీశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) తమ అమ్మకాలను సోమవారం నాడు కూడా కొనసాగించారు.

దీంతో పలు రంగాల షేర్లు పతనం అయ్యాయి. దీనికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ప్రెస్ మీట్ వార్తలు సెంటిమెంట్ ను మరింత దెబ్బతీశాయి. చమురు ధరల పతనం కూడా మార్కెట్ పై ఫ్రభావం చూపించింది. ఈ ధరలు భారీగా తగ్గటంతో అరబ్ దేశాల ఆదాయం తగ్గి ఆ ప్రభావం దేశీయ ఎగుమతులపై ఉంటుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News