‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ

Update: 2020-01-31 06:17 GMT

ప్రేమ కథల్లో మ్యాజిక్ అదే. ఎంత మంది ఎన్ని ప్రేమ కథలు తెరకెక్కించినా కొత్త ప్రేమలు..కొత్త ప్రేమ కథలూ పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే వాటిని తెరకెక్కించే విధానమే కీలకం. దాని ఆధారంగానే సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. రాజ్ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమానే ‘చూసీ చూడంగానే’. ప్రేమ కథల్లో పాయింట్స్ చాలా వరకూ రిపీట్ అవుతూనే ఉంటాయి. చూసీ చూడంగానే సినిమాలోనూ అదే జరిగింది. అయితే ఈ ప్రేమ కథలో ఓ ‘గమ్మత్తు’ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే ‘లైన్’ ఉంది. ఇక అసలు కథ విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్లు. హీరో. ఒకే కాలేజీలో చదువుతుంటారు. కానీ హీరోపై నిజమైన ప్రేమ ఉన్నది ఒకరికి. కానీ హీరోతో ప్రేమలో పడిపోయింది మరో అమ్మాయి. మరి నిజమైన ప్రేమికురాలు తన ప్రేమను ఎలా దక్కించుకుంది. దీనికి ఏ మార్గాలు ఎంచుకున్నది అన్నదే సినిమా స్టోరీలైన్. శివ కందుకూరికి జోడీగా ఈ సినిమాలో మాళవిక సతీషన్, వర్ష బొల్లమ్మలు నటించారు.

ఈ సినిమాలో డ్రమ్మర్ గా కన్పించిన వర్ష నటన సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. శివ కందుకూరికి హీరోగా తొలి సినిమానే అయినా ఎక్కడా కూడా నటనలో తొట్రుపాటు కన్పించలేదు. కూల్ గా చేసుకుంటూ వెళ్ళాడనే చెప్పాలి. తల్లిదండ్రుల ఒత్తిడితో ఇంజనీరింగ్ లో చేరి... ఇంజనీరింగ్ చదువు ఏ మాత్రం ఇష్టం లేక మధ్యలోనే డిస్ కంటిన్యూ చేసి..ఫోటోగ్రాఫర్ గా మారతాడు హీరో. పెళ్ళిళ్ల ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ వర్ష కూడా తండ్రి కోరిక మేరకు విదేశాల్లో ఎంఎస్ చేసి..తనకు ఇష్టమైన మ్యూజిక్ డైరక్టర్ గా మారుతుంది. దర్శకురాలు శేష సింధు రావ్ సినిమా ఫస్టాఫ్ లో కొంత భాగం మరీ స్లోగా నడిపించినట్లు అన్పించినా క్రమక్రమంగా సినిమా వేగం పుంజుకుంటుంది. మధ్యలో మధ్యలో వచ్చే డైలాగ్ లు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా రాజ్, వర్షల లవ్ ట్రాక్ స్టార్ట్ అయిన తర్వాతే సినిమాలో స్పీడ్ పెరుగుతుంది. ఓవరాల్ గా చూస్తే ‘చూసీ చూడంగానే’ యూత్ ను ఆకట్టుకునే ప్రేమకథ.

రేటింగ్. 2.5/5

Similar News