సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ‘అల..వైకుంఠపురములో’ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే ఈ సినిమాలో పాటలు ఎన్నడూలేని రీతిలో విశేష ఆదరణ పొందాయి. పాటలతోనే సినిమాపై హైప్ పీక్ కు చేరింది. దీనికితోడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమా కావటం ఒకెత్తు అయితే..అల్లు అర్జున్ వీరిద్దరి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ కావటం మరో విశేషం. సోమవారం నాడు హైదరాబాద్ లో ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ జరిగింది. అక్కడే సినిమా ట్రైలర్ ను కూడా ఆవిష్కరించింది. ఈ ట్రైలర్ చూస్తుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘సన్ ఆప్ సత్యమూర్తి’ గుర్తుకొస్తుంది.
అందులో తన తండ్రిని అందరూ మంచి వాళ్ళే అనుకోవాలి కోరుకునే యువకుడిగా అల్లు అర్జున్ కన్పిస్తారు. సినిమాలో నిజాలు మాత్రమే చెప్పే పాత్రను పోషించినట్లు కన్పిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న అబద్దాలు కూడా చెప్పటం రాకపోతే ఎలా బతుకుతావురా అంటూ మురళీశర్మ ప్రశ్నించటం.. నిజం చెప్పేటప్పుడే భయమేస్తుంది నాన్నా. చెప్పకపోతే ఎప్పటికీ భయం వేస్తుంది. ఇదీ అల్లు అర్జున్ డైలాగ్. ఈ డైలాగ్ విన్న టటు అచ్చా..నిజమే చెబుతావా ఎప్పుడూ..నిజమైతేనే వాడు చెబుతాడు’ అంటూ ట్రైలర్ లో వచ్చే డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. నా కొడుకు ఎక్కడున్నా రాజే అంటూ వచ్చే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
https://www.youtube.com/watch?v=SkENAjfVoNI&feature=emb_logo