లోకేష్ పప్పులో ఉల్లిపాయ గురించే చంద్రబాబు బాధ

Update: 2019-12-09 07:13 GMT

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు ఎంత సేపూ లోకేష్ పప్పులో ఉల్లిపాయ గురించే బాధ అని ఎద్దేవా చేశారు. మహిళా భద్రత గురించి అంటే బాలకృష్ణ, లోకేష్ గురించి చర్చిస్తారేమో అని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆయనకు మహిళల భద్రత గురించి ఆయనకు తెలియదు అని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ మహిళలను అవమానించేలా పాలించిందని ఆరోపించారు. కాల్ మన్, సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతలు ఉన్నారని..విజయవాడ కేంద్రంగా ఇది సాగిన విషయం తెలిసిందే అన్నారు.

దిశ హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలుసని..ఇంతటి కీలక అంశంపై చర్చకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమైతే దీనికి టీడీపీ అడ్డుపడటం సరికాదన్నారు. రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అయినా ఇబ్బంది వస్తే జగనన్న పాలనలో రక్షణ ఉంటుందని ధీమా తమ ప్రభుత్వం కల్పించనుందని తెలిపారు. ఆడపిల్లలు కన్నీరుకారిస్తే ఆ కన్నీరు ఆవిరి అయ్యేలోపే శిక్ష పడాలని అన్నారు. ఈ ఛర్చను అడ్డుకుంటున్న వారు అన్నం తింటున్నారా?. గడ్డి తింటున్నారా అని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల వేధింపుల కేసులో సత్వర న్యాయం జరగాలన్నారు.

 

Similar News