అమరావతిలో కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష

Update: 2019-12-27 04:14 GMT

ఏపీ బిజెపి అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతిలోనే ఉంచాలని కోరుతూ శుక్రవారం నాడు మౌనదీక్షకు కూర్చున్నారు. ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన ప్రాంతంలో ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

రాజధాని కోసం అంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టి, జలాలకు నమస్కరించి కన్నా తన దీక్షను ప్రారంభించారు. కన్నాతోపాటు బిజెపికి చెందిన నేతలు పలువురు ఇందులో పాల్గొన్నారు. మరో వైపు అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంత్రివర్గ సమావేశం ఉండటంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు.

Similar News